ముఖ మొటిమల చికిత్స. Owen Jones
Чтение книги онлайн.
Читать онлайн книгу ముఖ మొటిమల చికిత్స - Owen Jones страница 3
ఏదేమైనా, సెబమ్ మొత్తం అడ్డుపడటం వల్ల మొటిమలు, పాక్షికంగా అడ్డుపడడం వల్ల బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి, ఇవి పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తాయి. అడ్డుపడడం తీవ్రంగా వుంటే పెద్దవారిలో వైట్‌హెడ్స్ కూడా ఏర్పడతాయి.
ఇంకొక స్థాయి సమస్య ఉంది: కౌమారదశలో ఉన్నవారి చర్మంలో సెబమ్ అడ్డుపడడం ఉపరితలం దగ్గర ఉంటుంది, దీని ఫలితంగా చిన్నగా, సూదిగా వున్న ‘మొటిమలు’ వస్తాయి, లేదా ఇవి పైకి రాకుండా, పెద్ద గడ్డలుగా వస్తాయి, ఇవి సాధారణంగా ఎక్కువ బాధాకరంగా ఉంటాయి ఎందుకంటే ‘వాల్కనో‘ లాగా పేలడానికి చాలా ఎక్కువ ఒత్తిడికి గురవుతాయి.
కౌమారదశలో లేదా యుక్తవయస్సులో మొటిమలు శరీరంలోని ఏ భాగంలోనైనా ఏర్పడతాయి, అయితే ఇవి ముఖం, ఛాతీ మరియు వీపు భాగంలో సర్వసాధారణంగా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడే ఎక్కువ సేబాషియస్ గ్రంథులు ఉంటాయి. లైంగిక పరిపక్వతకు ఎదుగుతుండగా, ఈ సర్వవ్యాప్త సమస్యతో బాలురు, అలాగే బాలికలు ఒకేరీతిలో బాధపడుతున్నట్లు అనిపిస్తుంది. అయినప్పటికీ, అమ్మాయిలకు పొడవాటి జుట్టు వుంటుంది కాబట్టి, వారికే ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించవచ్చు.
మొటిమలను పూర్తిగా నివారించడం అసాధ్యం, ఎందుకంటే ఇవి అంతర్గత హార్మోన్ల మార్పుల వల్ల వస్తాయి, కానీ మీరు మొటిమలతో బాధపడుతుంటే, నూనే మీ శత్రువు. మీ స్వంత శరీరంలోని నూనె. అందువల్ల, కౌమారదశలో మొటిమలకు చికిత్స చేయించుకొనేటప్పుడు, మీ జుట్టు శుభ్రంగా కనిపించినప్పటికీ దాన్ని మీ ముఖం నుండి దూరంగా ఉంచండి. మీ దిండును తరచుగా మార్చుకోండి. నిజంగా తరచుగా, మీకు వీలైతే ప్రతి రోజూ మార్చండి.
మీ ముఖాన్ని