డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం. Lindsay Shepard
Чтение книги онлайн.
Читать онлайн книгу డయాబెటిక్ డైట్: డయాబెటిస్ కోసం పరిపూర్ణమైన వంటపుస్తకం - Lindsay Shepard страница 7
మొదట, మీరు తక్కువ పిండి పదార్థాలు, తక్కువ చక్కెర వున్న ఆహారం తీసుకోవాలని అనుకోవడం కొంచెం మిమ్మల్ని మానసిక షాక్ కు గురిచేయవచ్చు. వాస్తవానికి, చాలా మంది ప్రజలు తమ జీవితాంతం పాలకూర మీద జీవించాలని అనుకుంటారు. మీరు కనుగొనేదేమిటంటే, ఇప్పుడు మీరు చూడబోయే ఆహారం పిండి పదార్థాలు మరియు చక్కెర చాలా తక్కువగా ఉన్న ఎన్నో రకాల ఆహారాలను అందిస్తుంది. ఫలితంగా, మీరు ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారం తినవచ్చు.
ఏది ఏమైనప్పటికీ, రహస్యం ఏమిటంటే రక్తంలో తక్కువ చక్కెర స్థాయిలను ఏ ఆహారాలు ప్రోత్సహిస్తాయో తెలుసుకోవడమే. మీరు ఈ ఆహారాలను కనుగొన్నప్పుడు, మీ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవడం ఒక కఠినమైన పని కాదని మీరు కనుగొంటారు. ఏవిధమైన అపరాధభావం లేకుండానే మీరు ఇప్పటికీ రుచికరమైన ఆహారాన్ని ఆస్వాదించవచ్చు.
ఇప్పుడు అదే ఒక ప్రణాళిక!
|
|
2 వ అధ్యాయం : మధుమేహ వ్యాధిగ్రస్తులకు తక్కువ చక్కెర వున్న ఆహారం వల్ల కలిగే ప్రయోజనాలు
తక్కువ చక్కెర, తక్కువ పిండి పదార్థాలు వున్న ఆహారం ద్వారా మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేక ప్రయోజనాలను పొందుతారు. మంచి విషయం ఏమిటంటే, ప్రయోజనాలను పొందడానికి మీరు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, మీరు ఆహారం తీసుకోవడం మొదలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ప్రయోజనాలను చూడవచ్చు. ఇదే ఈ ఆహారాన్ని ప్రోత్సాహకరమైందిగా చేస్తుంది.
కాబట్టి, తక్కువ చక్కెర వున్న ఆహారం తీసుకునేటప్పుడు మీరు ఆశించే